బాలల హక్కులు.. యునిసెఫ్ తో చేతులు కలిపిన ఒమన్..!!

- November 15, 2024 , by Maagulf
బాలల హక్కులు.. యునిసెఫ్ తో చేతులు కలిపిన ఒమన్..!!

మస్కట్: బాలల హక్కులు, సామాజిక విధానం, సామాజిక రక్షణ రంగాలలో యునిసెఫ్ తో ఒమన్ చేతులు కలిపింది. ఈ మేరకు యూనిసెఫ్ నిపుణులు ఒమన్ సందర్శించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో సంబంధిత రంగాలలో తమ నాలెడ్జ్ ను పంచుకున్నారు.  గత వారం మస్కట్‌లో జరిగిన మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (మెనా) ప్రాంతం కోసం యునిసెఫ్ ప్రాంతీయ సామాజిక విధానం , సామాజిక రక్షణ నెట్‌వర్క్ సమావేశాన్ని పురస్కరించుకొని యునిసెఫ్ నిపుణుల బృందం ఒమన్ లో పర్యటించింది.  ఈ సమావేశంలో మెనాలోని 17 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. విస్తృత సామాజిక విధాన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక వేదికను అందించిందని వక్తలు అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com