36 -60 ఏళ్ల నివాసితులలో 67% మందికి ప్రీ-డయాబెటిక్..!!
- November 15, 2024
యూఏఈ: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ (MoHAP), ప్రైవేట్ హెల్త్ కేర్ దేశవ్యాప్తంగా డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ ముగిసింది.ఈ సందర్భంగా వెల్లడించిన డేటా ప్రకారం.. 36 -60 సంవత్సరాల మధ్య వయస్సు గల యూఏఈ నివాసితులలో 67 శాతం మంది ప్రీ-డయాబెటిక్ స్టేజీలో ఉన్నారు. 18 -35 సంవత్సరాల వయస్సు గల నివాసితులలో 24 శాతం మంది ప్రీ-డయాబెటిక్‌గా ఉన్నారని, 60 ఏళ్లు పైబడిన జనాభాలో 9 శాతం మంది కూడా ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నారని ప్రచార ఫలితాలు వెల్లడించాయి. ప్రీ-డయాబెటిక్‌గా నిర్ధారణ అయిన వారిలో 64 శాతం మంది అధిక బరువు లేనివారు, శారీరకంగా దృఢంగా కనిపించే వారు కూడా ప్రమాదంలో ఉన్నారని నివేదిక తెలిపింది. “యూఏఈ నివాసితుల ఆరోగ్యాన్ని కాపాడటానికి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది ప్రజలను పరీక్షించడం గురించి మాత్రమే కాదు, నిరంతర ఫాలో-అప్లు, జీవనశైలి సలహాల గురించి కూడా నిర్వహించాము.” అని నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్, మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బుతైనా బిన్ బెలైలా అన్నారు. జబీల్ పార్క్‌లో MoHAP నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూఏఈలో ప్రీ-డయాబెటిస్ వ్యాప్తికి సంబంధించిన డేటాను ఆవిష్కరించారు. అక్టోబర్ 2023లో 100 రోజులలోపు 5,000 మందిని పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్న విస్తృతమైన స్క్రీనింగ్ క్యాంపెయిన్.. ఈ సంవత్సరం 150,000 మందిని పరీక్షించారు. ప్రీ-డయాబెటిక్ ను తెలుసుకునేందుకు HbA1c పరీక్షలను ఉపయోగించారు. ఇది మూడు నెలల సగటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కొలుస్తుంది. ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించిన వారికి వారి జీవనశైలిని సవరించుకోవడంపై సలహాలు జారీ చేసినట్టు తెలిపారు. మూడు నెలల తర్వాత మళ్లీ పరీక్షించారు. ఆరు నెలల వ్యవధిలో తదుపరి తదుపరి పరీక్షలు నిర్వహించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు నెలల తర్వాత సేకరించిన డేటా ప్రకారం, 31.7 శాతం మంది వ్యక్తులు సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్ కు వచ్చింది. అయితే 64.6 శాతం మంది ప్రీ-డయాబెటిక్‌గా ఉన్నారు. 3.7 శాతం మంది మధుమేహానికి చేరుకున్నారు. ఆరు నెలల తర్వాత, వారి ప్రీ-డయాబెటిక్ స్థితిని తిప్పికొట్టిన వ్యక్తుల సంఖ్య 37.5 శాతానికి పెరిగింది. అయితే 59 శాతం మంది ప్రీ-డయాబెటిక్‌గా ఉన్నారు. 3.5 శాతం మంది డయబెటిక్ కు గురయ్యారు. ప్రీ-డయాబెటిక్‌గా గుర్తించబడిన తర్వాత చాలా మంది వ్యక్తులు సాధారణ స్థితికి చేరుకున్నారనే వాస్తవం మధుమేహాన్ని నివారించవచ్చని రుజువు చేస్తుందని డాక్టర్ బెలైలా చెప్పారు. యువకులను ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలని, వ్యాధి రాకుండా నిరోధించడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







