వెలగపూడిలో అన్న క్యాంటీన్ ..
- June 24, 2016
గుంటూరు జిల్లా వెలగపూడిలో అన్న క్యాంటీన్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. 300 చదరపు అడుగు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. రోజుకు 300 నుంచి 400 మంది ఈ క్యాంటీన్ కు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.అంతకుముందు తాత్కాలిక సచివాలయం సమీపంలోని మల్కాపురంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... పేదవారి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్న క్యాంటీన్లలో రాగి సంకటి అందజేయనున్నట్లు సునీత చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పరిటాల సునీత చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సునీత అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







