ఎపి, తెలంగాణకు మరిన్ని విమాన సర్వీస్ లు
- November 18, 2024
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణీకులకు ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. శీతాకాల సర్వీసుల్లో భాగంగా అదనపు సర్వీసులను ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అదనపు సర్వీసులను ప్రకటించడంతో ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెరిగాయి.
కొత్తగా ప్రకటించిన సర్వీసుల్లో హైదరాబాద్ – గ్వాలియర్ డైరెక్ట్ సర్వీస్, విశాఖపట్నం – విజయవాడ సర్వీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసుల సంఖ్య పెంచారు. అలానే హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన విమానాశ్రయాలకు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుపుతున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ తెలిపారు.
విజయవాడ నుంచి అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక సంస్థ ఎయిరిండియానే అని ఆయన చెప్పారు. సీజన్ మొత్తం మీద ఈ నగరాల నుంచి సర్వీసుల సంఖ్య 45 శాతం పెరిగినట్లు అంకుర్ గార్గ్ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







