నయనతార ఊచకోత
- November 18, 2024
లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది నయనతార.తనే మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూ కమర్షియల్ గా మంచి విజయాలు సాధిస్తూ వస్తోంది.అప్పుడప్పుడూ స్టార్ హీరోల సరసన ఆఫర్స్ వచ్చినా తన పాత్రలు బావుంటే ఓకే చెబుతోంది. అయితే నయనతార సోలోగా మూవీస్ లో ఇప్పటి వరకూ చేసినవి ఒకెత్తు.. ఇది ఒక్కటే ఒకెత్తు అనేలా ఉన్న మూవీ ‘రక్కయ్యే’. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే ఓ టాప్ హీరో సినిమా రేంజ్ లో కనిపిస్తోంది. టీజర్ తోనే వామ్మో అనిపించేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. సెంథిల్ నల్లస్వామి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి 96, సత్యం సుందరం ఫేమ్ గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించాడు. టీజర్ చూస్తే.. ఒక చిన్న ఇంటి ముందు పదుల సంఖ్యలో విలన్స్ ఉంటారు.. వాళ్లంతా ఆ ఇంటిలోని రక్కయ్యే అనే నయనతారను చంపడానికి వచ్చారని అర్థం అవుతుంది. ఇటు అదే ఇంట్లో ఉయ్యాలలో ఒక చిన్న పిల్లవాడు.. ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు చీరకట్టులో ఉన్న నయనతార రోటిలో ఎండు మిరపకాయలు దంచుతూ ఉంటుంది. ఆపై పిల్లాడికి పాలు పట్టించి.. ఒక పెద్ద కర్రకు రెండు కత్తులు బిగించి కట్టి మరో చేతిలో కొడవలి పట్టుకుని ఆ దుండగులపై విరుచుకు పడుతుంది నయన్. ఆ ఫైట్ చూస్తే.. ఓ లోకేష్ కనకరాజ్, రాజమౌళి, బోయపాటి మూవీస్ లోని యాక్షన్ సీన్ లా అనిపిస్తుంది. బిగించిన చీరకట్టులో రౌద్రంగా కనిపిస్తోన్న నయన్ ను చూస్తే ఈ సారి రచ్చ మామూలుగా ఉండబోదు అనేలా ఉంది. మరి మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. తన బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







