మహేష్ బాబు వాయిస్ తో అదరగొట్టిన ‘ముఫాసా’ ఫైనల్ తెలుగు ట్రైలర్

- November 20, 2024 , by Maagulf
మహేష్ బాబు వాయిస్ తో అదరగొట్టిన ‘ముఫాసా’ ఫైనల్ తెలుగు ట్రైలర్

బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్  విజువల్ వండర్ ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

అల్టిమేట్ జింగిల్ కింగ్ 'ముఫాసా: ది లయన్ కింగ్' లెగసిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది.

‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు.ఈ రోజు తెలుగు ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అదిరిపోయింది. విజువల్ వండర్ అనిపించిన ఈ ట్రైలర్ లో మహేష్ బాబు వాయిస్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ గా నిలిచింది. ‘ముఫాసా’ పాత్రకు మహేష్ బాబు చెప్పిన డైలాగ్ వైరల్ గా మారాయి. అభిమానులని విశేషంగా అలరించాయి.

టాకా పాత్రకు సత్యదేవ్‌  వాయిస్ ఇచ్చారు, టిమోన్‌ అండ్‌ పుంబాగా అలీ, బ్రహ్మానందం డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 20న ప్రేక్షకులు ముందురాబోతున్న ఈ మూవీ లేటెస్ట్ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com