శుభవార్త..ఇంటర్‌సిటీ బస్ సర్వీసెస్ విస్తరణ..!!

- November 21, 2024 , by Maagulf
శుభవార్త..ఇంటర్‌సిటీ బస్ సర్వీసెస్ విస్తరణ..!!

యూఏఈ: మెట్రో, ట్రామ్, సముద్ర రవాణా వంటి ఇతర మాస్ ట్రాన్సిట్ మోడ్‌లతో పబ్లిక్ బస్సులను మరింత అనుసంధానించబడాలని పెరుగుతున్న డిమాండ్‌కు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)  స్పందించింది. బస్సు నెట్‌వర్క్,  ఇంటర్‌సిటీ బస్సు సేవలను విస్తరించాలని యోచనలో ఉన్నట్ల ప్రకటించింది. యూఏఈ అంతటా ఉన్న ఇతర ఎమిరేట్‌లతో దుబాయ్‌ని కలిపే ఇంటర్‌సిటీ మార్గాలను కవర్ చేసేలా సర్వీసులను విస్తరించనున్నట్లు 'మాతో మాట్లాడండి' వర్చువల్ సెషన్‌ సందర్భంగా ప్రకటించింది.    

ఆర్టీఏ ప్రకారం, ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు బస్సులు 89.2 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందించాయి.   దుబాయ్‌లోని ప్రధాన రహదారులలో పీక్-అవర్ ట్రాఫిక్‌ను 30 శాతం తగ్గించగల రిమోట్, ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్క్ విధానాలను అమలు చేయాలని నిర్ణయించినట్టు ఈ నెల ప్రారంభంలో ఆర్టీఏ ప్రకటించింది. ట్రక్కుల కదలికలపై  పరిమితులను విధించడంతోపాటు బస్సులు, టాక్సీల కోసం ప్రత్యేక మార్గాలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదే సమయంలో నివాసితులు, సందర్శకులు ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలను చేపట్టనున్నట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com