జాయింట్ ఆపరేషన్..ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్ బస్ట్..!!
- November 22, 2024
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్‌లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ విజయవంతం అయింది. ఎయిర్ కార్గో ఫెసిలిటీలో భారీగా రవాణా అవుతున్న అక్రమ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెథాంఫేటమిన్ ("షాబు"), గంజాయి, CBD ఉత్పత్తులతో సహా 11,000 దీనార్‌ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్టు తెలిపారు. డ్రగ్స్ ప్యాకేజీని తీసుకునేందుకు ప్రయత్నించిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను టెస్టింగ్ కోసం పంపామని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పేర్కొంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేస్తారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కమ్యూనిటీ భాగస్వామ్యం ప్రాముఖ్యతను మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







