ఖతార్ జాతీయులకు యూఎస్ వీసా రహిత ప్రయాణం.. ESTA ప్రారంభం..!!
- November 22, 2024
దోహా: ఖతార్‌లోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI).. యూఎస్ సమన్వయంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA)ని నవంబర్ 22నుండి ప్రారంభం కానుంది. ఈ సిస్టమ్ వీసా మినహాయింపు కార్యక్రమం (VWP) కింద యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లేందుకు ఖతారీ పౌరులను అనుమతిస్తుంది. యూఎస్ ను సందర్శించడానికి వీసా లేకుండ 90 రోజుల వరకు ఉండేందుకు అనుమతియ్యానున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ ప్రకటించింది. " ఖతార్ పౌరులు అధికారిక ESTA వెబ్‌సైట్ ద్వారా లేదా మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా ప్రయాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రయాణ తేదీకి కనీసం 72 గంటల ముందు అవసరమైన ఫారమ్ పూర్తి చేయాలి. వీసా మినహాయింపు ప్రోగ్రామ్ కింద అవసరమైన ప్రయాణ, గుర్తింపు పత్రాలను సమర్పించాలి.’’ అని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







