BAPS హిందూ మందిర్ అబుదాబికి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు..!!

- November 22, 2024 , by Maagulf
BAPS హిందూ మందిర్ అబుదాబికి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు..!!

అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్.. మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. నవంబర్ 20న యూఏఈలోని దుబాయ్ మెరీనాలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో మష్రెక్‌తో ఆధ్వర్యంలో జరిగిన MEED ప్రాజెక్ట్ అవార్డ్స్ 2024లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది. బాప్స్ మందిర్ నిర్మాణ నైపుణ్యం, సాంస్కృతిక ప్రాముఖ్యత, సానుకూల సామాజిక ప్రభావానికి గుర్తింపు లభించింది. యూఏఈలో ఉత్తమ సాంస్కృతిక ప్రాజెక్ట్, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా (MENA)లో ఉత్తమ సాంస్కృతిక ప్రాజెక్ట్ (MENA) అవార్డులను అందుకుంది.  

2007 నుండి MENA ప్రాంతంలో గోల్డ్ స్టాండర్డ్‌గా గుర్తింపుపొందిన MEED ప్రాజెక్ట్ అవార్డ్స్.. ఇంజనీరింగ్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీలో అత్యుత్తమమైన వాటిని గుర్తించి సత్కరిస్తుంది.  బాప్స్ హిందూ మందిర్ కమిటీ, క్యాపిటల్ ఇంజినీరింగ్‌లోని వారి భాగస్వాములతో కలిసి అవార్డులను స్వీకరించారు.

రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడంపై BAPS హిందూ మందిర్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు మందిర్ సాంకేతిక, నిర్మాణ నైపుణ్యాన్ని మాత్రమే కాదని, దాని సృష్టిని ప్రేరేపించిన ఐక్యత, సామరస్య స్ఫూర్తిని కూడా హైలైట్ చేస్తుందన్నారు. H.H. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దాతృత్వం, మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వం కారణంగా మందిర్ నిర్మాణం కల సాకారమైందని పేర్కొన్నారు. 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com