సీత్ర సమీపంలో పడవ ప్రమాదం.. ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి..!!
- November 22, 2024
మనామా: సీత్ర సమీపంలో పడవ ప్రమాదంలో ఓ వ్యక్తి ఆదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం పడవ ఢీకొనడంతో సీత్ర సమీపంలో అదృశ్యమైన 26 ఏళ్ల ఇసా అలీ కోసం రెస్క్యూ టీమ్‌లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో అతడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అల్వార్ఫ్ ప్రాంతంలో తన తండ్రితో కలిసి చేపల వేటకు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ నేతృత్వంలో డైవర్లు, సివిల్ పెట్రోలింగ్, స్థానిక మత్స్యకారుల మద్దతుతో రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







