కువైట్‌లో "మోడైలాగ్" పుస్తకాన్ని ఆవిష్కరించిన స్మృతి ఇరానీ
- November 23, 2024
కువైట్: కువైట్‌లో డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ రచించిన "మోడైలాగ్: కన్వర్సేషన్స్ ఫర్ ఎ విక్షిత్ భారత్" పుస్తకాన్ని భారత మాజీ కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కువైట్‌లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, పుస్తక రచయిత డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ లతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా కువైట్ గురించి ప్రస్తావించినందుకు తాను సంతోషిస్తున్నట్టు రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు. మోదీలాగ్ ద్వారా డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్న కథనాల సారాంశాన్ని అందించారని స్మృతి ఇరానీ అన్నారు. ఈ పుస్తకంలో 4,200 మందికి పైగా వ్యక్తుల నుండి వచ్చిన ప్రతిస్పందనలతో ప్రజలపై మన్ కీ బాత్ చూపెట్టిన సానుకూల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







