సౌదీ అరేబియాలో 73.7% పెరిగిన ఇన్వెస్ట్ మెంట్ లైసెన్సులు..!!

- November 23, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో 73.7% పెరిగిన ఇన్వెస్ట్ మెంట్ లైసెన్సులు..!!

రియాద్ : 2024 మూడవ త్రైమాసికంలో సౌదీ అరేబియాలో జారీ చేసిన పెట్టుబడి లైసెన్సుల సంఖ్య 73.7% పెరిగింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 2,193 లైసెన్స్‌లతో పోలిస్తే 3,810కి చేరుకుంది.  పెట్టుబడి మంత్రిత్వ శాఖ ఇటీవలి నివేదిక ప్రకారం.. చాలా లైసెన్స్‌లు నిర్మాణం, తయారీ, వృత్తిపరమైన,  విద్యా కార్యకలాపాలు, రిటైల్ వాణిజ్యం, సమాచార రంగాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. Q3 2024లో జారీ చేయబడిన మొత్తం లైసెన్స్‌లలో ఈ కేటగిరికి చెందనవి దాదాపు 72% వాటాను కలిగి ఉన్నాయి. సింగిల్ మెంబర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలకు 2,853 లైసెన్సులు జారీ చేయగా, 713 లైసెన్సులు మల్టీ మెంబర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలకు వెళ్లినట్టు నివేదిక వెల్లడించింది.  అనేక గ్లోబల్ సూచీలలో సౌదీ అరేబియా పురోగమనాన్ని దాని బలమైన ఆర్థిక, పెట్టుబడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని నివేదిక హైలైట్ చేసింది. సౌదీలో పెట్టుబడి వ్యవస్థలు, నిబంధనలను మెరుగుపరచడానికి ప్రభుత్వ భాగస్వాములతో సహకరించడం ద్వారా పోటీతత్వ, సురక్షితమైన పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com