తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై TTD EO సమీక్ష
- November 24, 2024
తిరుమల: తిరుచానూరు పద్మావతి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు టిటిడి, పోలీసు, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు.
శనివారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో పవిత్రోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ సుభాన్ బన్సాల్‌తో కలిసి టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ.. డిసెంబర్ 6న నిర్వహించనున్న పంచమీ తీర్థం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరుగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల అనంతరం భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, మొబైల్ ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స వైద్య బృందాలు, సైన్ బోర్డ్ ల ఏర్పాటు, భక్తుల తాకిడికి తగ్గట్టుగా అన్నప్రసాదాల పంపిణీ చేపట్టాలన్నారు.
అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసుకుని భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయ మీటింగ్ లు ఏర్పాటు చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి ఎఫ్ ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, హెల్త్ ఆఫీసర్ సునీల్, తిరుపతి, తిరుచానూరు కి చెందిన పోలీసు, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







