కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- November 26, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు, పథకాలను ఆమోదించింది. ఇందులో వ్యవసాయం, ఆవిష్కరణలు, విద్య, ఇంధన వరులు, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ తదితర రంగాలకు సంబంధించిన నిర్ణయాలున్నాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియా సమావేశంలోవివరించారు.
పాన్‌కార్డు ఆధునీకరణకు ఆమోదం తెలుపుతూ పాన్ 2.0కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలను దీనికి జోడించనుంది. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’’ స్కీమ్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. తద్వారా ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీల జర్నల్స్, పరిశోధనా పత్రాలను మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.
స్వతంత్ర కేంద్ర ప్రాయోజిత పథకంగా ‘‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’’ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గంఆమోదం తెలిపింది. దీనికోసం మొత్తం రూ.2,481 కోట్ల ఆర్థిక వ్యయాన్ని హైలైట్ చేశారు. ఇందులో భారత ప్రభుత్వం రూ.1,584 కోట్లు, మిగిలిన రూ.897 కోట్లు రాష్ట్రాలు భరిస్తాయి. ఇక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు AIM 2.0కి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది రూ.2,750 కోట్ల బడ్జెట్‌తో మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 240 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పెట్టుబడి ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,939 కోట్ల వ్యయంతో 50 నెలల కాల వ్యవధితో ఈ ప్రాజెక్ట్ ఈశాన్య ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రూ.7,927 కోట్లతో మూడు మల్టిట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను క్యాబినెట్ మంజూరు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







