ప్రముఖ లిరిసిస్ట్ కులశేఖర్ కన్నుమూత
- November 26, 2024
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత కులశేఖర్ అనారోగ్య కారణాలతో మంగళవారం రోజు కన్నుమూశారు. గాంధీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తన కెరీర్‌లో ఓ వెలుగు వెలిగిన సినీ రైటర్‌గా కులశేఖర్ గుర్తింపు పొందారు. చిత్రం, ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం వంటి హిట్ చిత్రాలకు కులశేఖర్ పాటలు అందించారు. ఇక ఆ తరువాత ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దీంతో ఆయన కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయారు.
ఇప్పుడు ఇలా తన చివరి రోజుల్లో దయనీయ స్థితిలో మృతి చెందడం సినీ అభిమానుల్ని కలచివేస్తుంది. కులశేఖర్ మరణ వార్త గురించి తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







