సుల్తాన్ ఫైసల్ స్కూల్ ను సందర్శించిన సుల్తాన్..!!
- November 26, 2024
అల్ అమెరత్: మస్కట్ గవర్నరేట్, అల్ అమెరత్ విలాయత్‌లోని "సుల్తాన్ ఫైసల్ బిన్ టర్కీ బాలుర పాఠశాల"ని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాను మెరుగుపరడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, విద్యార్థుల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు సుల్తాన్ కు విద్యా శాఖమంత్రి, డా. మదీహా అహ్మద్ అల్ షైబానీ స్వాగతం పలికారు. ఆ తర్వాత పాఠశాల గురించి విద్యార్థులు చెప్పిన విషయాలను శ్రద్ధంగా విన్నారు. స్కూల్ క్లాసు రూములను, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆర్థిక సంస్కృతిక, సాంకేతిక విద్యతో పాటు విద్యా ప్రక్రియలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వంటి రంగాలలో అమలు చేసిన కార్యక్రమాలు, కార్యకలాపాల నమూనాలను ప్రదర్శించారు. అనంతరం సుల్తాన్ సుల్తాన్ ఫైన్ ఆర్ట్స్ హాల్‌లో జరిగిన వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. చివరకు మస్కట్ గవర్నరేట్‌లోని వివిధ పాఠశాలల నుండి ఫ్యాకల్టీతో సుల్తాన్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







