ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్‌

- November 26, 2024 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్​లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 4 రాష్ట్రాల్లోని 6 ఖాళీలకు ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీఐ తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, బంగాల్‌, హరియాణా రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్‌ 10వ తేదీ తుదిగడువుగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించింది. డిసెంబర్‌ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్‌ 13 తుదిగడువుగా తెలిపారు. డిసెంబర్‌ 20వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూల్​లో పేర్కొంది. అదేరోజు ఓట్లను లెక్కిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com