ఆస్కార్ ఆఫ్ జర్నలిజంలో రెండు మీడియా అవార్డులను గెల్చుకున్న ఒమాన్

- November 27, 2024 , by Maagulf
ఆస్కార్ ఆఫ్ జర్నలిజంలో రెండు మీడియా అవార్డులను గెల్చుకున్న ఒమాన్

మస్కట్: లండన్‌లో జరిగిన ఆస్కార్ ఆఫ్ జర్నలిజం వేడుకలో ఒమన్ సుల్తానేట్ రెండు మీడియా అవార్డులను అందుకుంది. లండన్‌లో జరిగిన వార్షిక ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (FPA) మీడియా అవార్డ్స్ వేడుకలో ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.ఈ అవార్డులను ‘ఆస్కార్ ఆఫ్ జర్నలిజం’ అని కూడా పిలుస్తారు.

ఈ అవార్డులలో మొదటిది ‘ట్రావెల్ టూరిజం స్టోరీ ఆఫ్ ది ఇయర్’. రెండవది ‘బెస్ట్ టీవీ మరియు రేడియో స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీలో ఈ అవార్డులు లభించాయి .

ఈ అవార్డులను యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి బదర్ మహ్మద్ అల్ మంథేరి విజేతలైన మీడియా నిపుణులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లండన్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయానికి చెందిన పలువురు మీడియా నిపుణులు, కళాకారులు, మేధావులు మరియు దౌత్యవేత్తలు ఈ వేడుకలో పాల్గొన్నారు. వార్షిక ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (FPA) మీడియా అవార్డ్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఒమన్ సుల్తానేట్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా ఉందనీ ఒమన్ రాయబారి బదర్ మహ్మద్ అల్ మంథేరి తన సంతోషం వ్యక్తం చేశారు.


ఇంకా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఒమన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ అవార్డులు ఒమన్ లోని మీడియా రంగాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశం తరపున ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల వారు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు ఒమన్ మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తాయనీ వారు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఒమన్ మీడియా రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించే ఈ వేడుక ఒమన్ యొక్క వారసత్వం మరియు సంస్కృతిని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం అని వారు తమ అభిప్రాయం తెలిపారు.

ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో ఒమానీ క్రాఫ్ట్‌లు మరియు డిజైన్‌లను ప్రదర్శించే ఒక గ్యాలరీతో పాటు ఒక షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన కూడా జరిగింది. మొత్తానికి ఈ అవార్డుల ప్రదానోత్సవం జర్నలిజం రంగంలో ఉన్నత ప్రమాణాలను గుర్తించడానికి మరియు ప్రోత్సహించడానికి నిర్వహించబడింది. ఒమన్ సుల్తానేట్ ఈ అవార్డులను అందుకోవడం ద్వారా తమ దేశం మీడియా రంగంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తుందని నిరూపించింది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com