తెలుగు వారి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తపాలా స్టాంప్ లు

- November 27, 2024 , by Maagulf
తెలుగు వారి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తపాలా స్టాంప్ లు

న్యూ ఢిల్లీ: భారతదేశ సంప్రదాయం, చరిత్రకారులు ఘనతను ప్రతిబింబించడంతోపాటు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా ఫిలాటెలి ఆవిష్కరణలు జరగాలి.అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

ఢిల్లీలో గల స్థానిక డాక్ భవన్ లో జరిగిన ఫిలా టెలిక్ అడ్వైజరీ (పి.ఎ.సి–తపాలా స్టాంపుల విభాగం) ప్రత్యేక సమావేశం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిలాటెలిక్ నూతన కార్యక్రమాలను రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను సంరక్షించడం, దేశ ప్రగతిశీల దృక్పథంలో లోతైన సంబంధాలను పెంపొందించేలా ఫిలాటెలి భవిష్యత్ కార్యక్రమాలు ఉండాలని ఆయన ఉద్ధాటించారు.

కార్యక్రమంలో భాగంగా గతంలో జరిగిన జిల్లా, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. కాగా త్వరలో విడుదల చేయబోవు తపాలా స్టాంపుల విషయంలో పెమ్మసాని ఒక స్పష్టమైన ఆదేశాలను సూచించారు. ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ లో విడుదల చేసిన (అక్కినేని నాగేశ్వరరావు) స్మారక తపాలా స్టాంపు విడుదలలోను పెమ్మసాని చొరవ ప్రధానమైనదని చెప్పవచ్చు.

ఈ కార్యక్రమంలో 20 వినూత్న స్టాంపులతో పాటు మొత్తం 51 తపాలా స్టాంపులకు ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ(లోక్ సభ) దేవ్ సింహ చౌహన్, ఎంపీ (రాజ్యసభ) ఎస్ సెల్వే గానా బాతి, సెక్రటరీ శ్రీమతి వందిత కౌల్, డైరెక్టర్ జనరల్ సంజయ్ శరణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com