హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
- November 27, 2024
న్యూ ఢిల్లీ: అయ్యప్ప దర్శనం కోసం శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ – కొట్టాయం (07133) మధ్య డిసెంబర్ 5, 12, 19, 26 మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయానికి రైలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొట్టాయం – కాచిగూడ (07134) రైలు 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి.. ఆ తర్వాతి రోజున రాత్రి 11.40 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుతుంది. బేగంపేట, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, యాద్గిర్, కృష్ణా, రాయ్‌చూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతుందని వివరించింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచులు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







