యూఏఈ నేషనల్ డే..4,500 మందికి పైగా ఖైదీలు విడుదల..!!
- November 28, 2024
యూఏఈం 53వ నేషనల్ డే సందర్భంగా 4,500 మందికి పైగా ఖైదీలను యూఏఈ విడుదల చేయనుంది. ఇందులో 2,269 మంది ఖైదీలను విడుదల చేయాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ ఆదేశించారు.అదే సమయంలో వివిధ రకాల నేరాలకు శిక్ష పడిన ఖైదీలకు విధించిన అన్ని జరిమానాలను రద్దు చేయనున్నారు. విడుదలైన ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, వారి కుటుంబాలలో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు వివిధ దేశాలకు చెందిన 1,169 మంది ఖైదీలను విడుదల చేయాలని, వీలైనంత త్వరగా ఆర్డర్‌ను అమలు చేయాలని అధికారులను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశించారు. యూఏఈ 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా 683 మంది ఖైదీలను విడుదల చేయాలని అంతకుముందు షార్జా పాలకుడు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, అజ్మాన్ పాలకుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి కూడా 304 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్-షార్కీ కూడా 118 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







