అక్కినేని హీరోల పెళ్లి ఒకేరోజా?..క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున

- November 28, 2024 , by Maagulf
అక్కినేని హీరోల పెళ్లి ఒకేరోజా?..క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున

అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. చివరిగా ఏజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖిల్ పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ కొట్టలేదు అఖిల్. మరి ఇకపై ఎలాంటి సినిమాతో అలరిస్తాడో చూడాలి.

అయితే ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనబ్‌ రవ్జీతో ఈనెల 26న నిశ్చితార్థం జరిగింది. ఇక విషయాన్నీ తెలుపుతూ అఖిల్ తనకి కాబోయే భార్యతో ఉన్న పలు ఫోటోలను షేర్ చేసారు. అలాగే నాగార్జున సైతం వారి నిశ్చితార్థానికి సంబందించిన అధికారిక ప్రకటన చేసారు. అయితే వీరి నిశ్చితార్థం జరిగినప్పటి నుండి అక్కినేని బ్రదర్స్ వివాహం ఒకేసారి జరగనుందని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నాగచైతన్య వివాహం శోభితతో డిసెంబర్‌ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. వీరి వివాహ సమయం దగ్గర పడుతున్న క్రమంలో సడన్ గా అఖిల్ నిశ్చితార్థం జరగడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి.

కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు నాగ్. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నాగ్.. ‘అఖిల్‌ నిశ్చితార్థం జరగడంతో చాలా సంతోషంగా ఉన్నాను. అఖిల్ కి కాబోయే భార్య జైనబ్‌ చాలా మంచి అమ్మాయి.చాలా అందంగా ఉంటుంది. వారు ఇద్దరూ వారి జీవితాలను కలిసి పంచుకోవాలి అనుకున్నారు. దీనికి మా ఫ్యామిలీ అందరూ చాలా సంతోషిస్తున్నాం. వీరి వివాహం ఇప్పుడు కాదు. 2025లో జరుగుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అక్కినేని బ్రదర్స్ వివాహం ఒకేసారి కాదు అని తేలిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com