14వ కటారా ట్రేడిషనల్ ధోవ్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- November 28, 2024
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆధ్వర్యంలో 14వ కటారా సాంప్రదాయ ధోవ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ ఇబ్రహీం అల్ సులైతి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో HE షేక్ ఫైసల్ బిన్ ఖాసిమ్ అల్ థానీ, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ ఖతార్ నిర్వహించే అత్యంత ముఖ్యమైన వారసత్వ పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం ఇది అనేక గల్ఫ్, అరబ్ తోపాటు స్నేహపూర్వక దేశాలను ఒకచోట చేర్చింది. ధౌ ఫెస్టివల్ కార్యకలాపాలు డిసెంబర్ 7 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా కటారా జనరల్ మేనేజర్ అల్ సులైతి మాట్లాడుతూ.. ఖతారీ, గల్ఫ్ సముద్ర వారసత్వాన్ని పురస్కరించుకుని, కొత్త తరాలకు సాంస్కృతిక గుర్తింపు కటారా సాంప్రదాయ ధో ఉత్సవం ద్వారా అందుతుందన్నారు. ఇది గతంలో మన దైనందిన జీవితంలో ముఖ్యమైన సముద్ర సంప్రదాయాలను హైలైట్ చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, కువైట్, ఇరాక్, ఇండియా, టాంజానియా, ఇరాన్, పాలస్తీనా వంటి 11 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా సముద్రంలో "లాబ్రేఖా, "స్వోర్డ్ ఫిషింగ్ కాంపిటీషన్", "పెర్ల్ డైవింగ్","రోయింగ్", "సెన్యార్ ఫ్యామిలీ కాంపిటీషన్" వంటి సముద్ర పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







