కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. జైలుశిక్షతోపాటు భారీగా జరిమానాలు..!!

- November 28, 2024 , by Maagulf
కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. జైలుశిక్షతోపాటు భారీగా జరిమానాలు..!!

కువైట్: కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టానికి సంబంధించి డిక్రీ త్వరలో జారీ చేయనున్నారు.  గత నెలలో ట్రాఫిక్ వ్యవహారాలు కార్యకలాపాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా ఓ ఇంటర్వ్యూలో కొత్త ట్రాఫిక్ చట్టం గురించి కొన్ని వివరాలను అందించారు. దీని ప్రకారం, నిషేధిత ప్రాంతాలలో పార్కింగ్ కు ఉన్న KD 5ను KD 15కు పెంచారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైతే అతిపెద్ద జరిమానా KD 5,000 గా నిర్ణయించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడితే జరిమానా KD 5 నుండి KD 75 కి, సీట్ బెల్ట్ పెట్టుకొనందుకు జరిమానాను KD 10 నుండి KD 30కి పొడిగించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు KD 150, రెడ్‌లైట్‌ని జంప్ KD 150కి మూడు రెట్లు పెంచారు. వికలాంగుల కోసం స్థలాలలో పార్కింగ్ చేస్తే  KD 150కి  జరిమానాను పెంచారు.  మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి 3వే దిర్హామ్స్ తో రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.   ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తిని ధ్వంసం చేస్తే KD3 వేల దిర్హాంతోపాటు  ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com