దుబాయ్ లో కొత్త మ్యూజియం..ఫోటోగ్రఫీకి ప్రత్యేకం..!!

- November 28, 2024 , by Maagulf
దుబాయ్ లో కొత్త మ్యూజియం..ఫోటోగ్రఫీకి ప్రత్యేకం..!!

యూఏఈ: దుబాయ్ లో ఇప్పుడు మరో కొత్త ఆకర్షణ వచ్చి చేరింది.  ఫోటోగ్రఫీకి ప్రత్యేకమైన మ్యూజియం ప్రారంభమైంది.  దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) ఛైర్‌పర్సన్ షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్ ఫోటోగ్రఫీ మ్యూజియం ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ చరిత్రను తెలిపేలా డిజైన్ చేశారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుడి సేకరించిన అనేక ఫోటో ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు.  దుబాయ్ ఫోటోగ్రఫీ మ్యూజియం ఒక గొప్ప మైలురాయి, ఇది ప్రతిభకు గ్లోబల్ హబ్‌గా ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్‌లకు ప్రధాన గమ్యస్థానంగా ఎమిరేట్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని షేఖా లతీఫా అన్నారు.

2027 నాటికి గ్లోబల్ ఫోటోగ్రఫీ మార్కెట్ $62.4 బిలియన్లకు చేరుకుంటుందని,  ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తుందని భావిస్తున్నరు.  ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం విద్యా పరమైన కోర్సులు, వర్క్‌షాప్‌లను అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్‌లను ఒకచోటకు మ్యూజియం చేర్చనున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com