ఒమన్‌లో విజయవంతంగా అవయవ మార్పిడి చికిత్స

- November 28, 2024 , by Maagulf
ఒమన్‌లో విజయవంతంగా అవయవ మార్పిడి చికిత్స

మస్కట్: 2024 సంవత్సరం ఒమన్‌లో అవయవ మార్పిడి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఒమన్ లో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం నిర్వంచిన సందర్భంగా ఇద్దరు బ్రెయిన్ డెడ్ దాతల నుండి కిడ్నీలను విజయవంతంగా మార్పిడి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. ఈ మార్పిడి విధానాలు రాయల్ హాస్పిటల్ మరియు సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ హాస్పిటల్ (SQUH)లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి, ఇది ఒమన్ యొక్క అవయవ దానం కార్యక్రమాల విజయాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఈ సందర్భంగా SQUH అవయవ దానం విభాగం అధిపతి డాక్టర్ ఖాసిమ్ బిన్ మహమ్మద్ అల్ జహ్దామి మాట్లాడుతూ కిడ్నీ వైఫల్యం ఉన్న రోగులకు రాయల్ హాస్పిటల్‌లో నిర్వహించిన మొదటి అవయవ మార్పిడి కి 34 నిమిషాలు, రెండవ అవయవ మార్పిడి కిన్27 నిమిషాలు పట్టిందని తెలిపారు. విజయవంతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో డాక్టర్ జయనా బింట్ తలిబ్ అల్ హద్రామి ఆధ్వర్యంలో జరిగింది. మస్కట్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించి, అవయవాన్ని 35 నిమిషాల్లో రవాణా చేయడం ద్వారా ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగామని ఆయన తెలిపారు. ఆపరేషన్ సక్సెస్ కోసం కృషి చేసిన అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

డాక్టర్ ఖాసిమ్ తెలిపిన సమాచారం ప్రకారం ప్రకారం ఈ సంవత్సరం ఒమన్‌లో అవయవ దానాలు రికార్డు స్థాయిలో జరిగాయి. కొంతమంది ఒమాని కుటుంబాలు తమ బ్రెయిన్ డెడ్ బంధువుల అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు, ఫలితంగా పది కిడ్నీలు మరియు రెండు కాలేయాలు మార్పిడి చేయబడ్డాయి. 1988 నుండి ఒమన్‌లో కిడ్నీ మార్పిడి ప్రారంభమైనప్పటి నుండి ఇది ఒకే సంవత్సరంలో జరిగిన అత్యధిక అవయవ దానాల సంఖ్య అని ఆయన తెలిపారు. ఇంకా అవయవ దానం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని డాక్టర్ ఖాసిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవయవ దానం ద్వారా అవయవ వైఫల్యం ఉన్న రోగులకు కొత్త ఆశ మరియు జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. 

ప్రస్తుతం ఒమన్‌లో 2,000 మందికి పైగా కిడ్నీ వైఫల్యం ఉన్న రోగులు డయాలిసిస్‌పై ఆధారపడి ఉన్నారు. కాలేయం, గుండె మరియు ఇతర అవయవ వైఫల్యం ఉన్న అనేక మంది రోగులు కూడా మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. అవయవ దాతల అవసరం అత్యవసరమని డాక్టర్ జయనా పేర్కొన్నారు. దాతల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి దాతృత్వం అమూల్యమని డాక్టర్ ఖాసిమ్ అన్నారు. మరణించిన దాతలు మరియు వారి కుటుంబాలకు దైవ కృప ఉండాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com