రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై రజనీ అభిమానులు ఆరోపణలు
- June 26, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై మదురైలోని రజనీకాంత్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జిల్లాలో పోస్టర్లు అంటించి కలకలానికి తెరలేపారు. మదురై జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం సభ్యుడు జిల్లా శేఖర్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై ఆరోపణలు గుప్పిస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.ఆ పోస్టర్లలో రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్, లింగా చిత్రాల అపజయాలకు, ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవడానికి కారణం సత్యనారాయణేనని పేర్కొన్నాడు. అంతే కాకుండా 2015 ఏప్రిల్ 23న చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తాను చెప్పిన విషయాన్ని సత్యనారాయణ రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లలేదని అందుకు తాను ఆదివారం మదురై మీనాక్షి దేవాలయంలో పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మదురై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







