రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై రజనీ అభిమానులు ఆరోపణలు

- June 26, 2016 , by Maagulf
రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై రజనీ అభిమానులు ఆరోపణలు

సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై మదురైలోని రజనీకాంత్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. జిల్లాలో పోస్టర్లు అంటించి కలకలానికి తెరలేపారు. మదురై జిల్లా రజనీకాంత్ అభిమాన సంఘం సభ్యుడు జిల్లా శేఖర్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణపై ఆరోపణలు గుప్పిస్తూ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.ఆ పోస్టర్లలో రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్, లింగా చిత్రాల అపజయాలకు, ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవడానికి కారణం సత్యనారాయణేనని పేర్కొన్నాడు. అంతే కాకుండా 2015 ఏప్రిల్ 23న చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తాను చెప్పిన విషయాన్ని సత్యనారాయణ రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లలేదని అందుకు తాను ఆదివారం మదురై మీనాక్షి దేవాలయంలో పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మదురై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com