మహారాష్ట్ర: బస్సు బోల్తా..10 మంది మృతి
- November 29, 2024
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడి 10మంది మృతిచెందారు.ఈ ఘటనలో దాదాపు మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బోల్తా పడి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని బింద్రవాన తోల గ్రామానికి సమీపంలో కోహ్‌మరా స్టేట్ హైవేపై ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఇక ఈ బస్సు ప్రమాదంలో గాయపడిన వారని గోండియా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గోండియా పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







