సౌదీలో 164 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..!!

- December 03, 2024 , by Maagulf
సౌదీలో 164 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..!!

రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై నాలుగు మంత్రిత్వ శాఖలకు చెందిన 164 మంది ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో హోం, హెల్త్, ఎడ్యుకేషన్, మునిసిపాలిటీ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారందరూ లంచం, కార్యాలయ దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.  నజాహా అధికారులు నవంబర్ నెలలో 1635 తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించారు. అవినీతి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను నమోదు చేసినట్లు, 370 మంది ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com