ముద్రగడకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు
- June 26, 2016
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సినిమా తారల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ సినీ నటి హేమ ఆదివారం నాడు ముద్రగడను పరామర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని ఆయన నివాసానికి హేమ వచ్చారు.
ముద్రగడ పైచేయి సాధించినా..: చిరు-దాసరిని ఇరుకునపడేసిన బాబు!ఈ సందర్భంగా ఆమె ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని, ఆయన కుటుంబ ఆరోగ్య పరిస్థితిని గురించటి అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలని ముద్రగడ ఇటీవల పదమూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.
ఆయన దీక్షకు కాపు నేతల నుంచి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే. కాపు నేతలు ఆయన దీక్షకు మద్దతుగా సమావేశాలు నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా.
నా భార్య, కోడల్ని తిట్టారు, బాబుపై పోరాటమే: ముద్రగడ కంటతడి
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణ రావు, కాంగ్రెస్ నేతలు పళ్లం రాజు, వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు పలుమార్లు ముద్రగడ దీక్షకు మద్దతుగా సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







