మస్కట్‌లో అక్రమ క్యాంపింగ్‌లకు భారీ జరిమానాలు..!!

- December 04, 2024 , by Maagulf
మస్కట్‌లో అక్రమ క్యాంపింగ్‌లకు భారీ జరిమానాలు..!!

మస్కట్: ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణను కాపాడే లక్ష్యంతో క్యాంపింగ్ కోసం మస్కట్ గవర్నరేట్ కొత్త నిబంధనలను జారీ చేసింది. మస్కట్ గవర్నరేట్‌లో లైసెన్సు లేకుండా క్యాంపులు చేసే ఎవరికైనా OMR 200 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.  48 గంటల కంటే ఎక్కువ సమయం క్యాంపులు, కారవాన్‌లు, టెంట్లు లేదా సెషన్‌లలో అనుమతి లేకుండా అనుమతించబడదని మస్కట్ గవర్నరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. OMR 100 బీమా తప్పనిసరిగా చెల్లించాలని నిర్దేశించింది. లైసెన్స్ ఏడు రోజులకు వర్తిస్తుందని, రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపింది. 

క్యాంపింగ్ సైట్ గైడ్ లైన్స్:

1. ఇది మునిసిపాలిటీ ద్వారా నిర్దేశిత ప్రదేశాలలోనే ఉండాలి.

2. క్యాంపింగ్ సైట్,  బీచ్ మధ్య కనీసం 10 మీటర్ల దూరం ఉండాలి.

3. ప్రతి సైట్ మధ్య కనీసం 5 మీటర్ల దూరం తప్పనిసరి.

4. క్యాంపింగ్ సైట్ మత్స్యకారుల సైట్‌లు, భద్రతా నిషేధిత సైట్‌లకు దూరంగా ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com