మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతికి కారణమైన డ్రైవర్ కు జైలుశిక్ష
- December 04, 2024
మనామా: మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కేసులో ఒక ఆసియా వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. దిగువ క్రిమినల్ కోర్టు విధించిన శిక్షను కాసేషన్ కోర్ట్ సమర్థించింది.
డిసెంబరు 22, 2023న నిందితుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. తన వాహనంపై నియంత్రణ కోల్పోయి, లైట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు మరణించాడు. కుటుంబ సభ్యులలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
పబ్లిక్ ప్రాసిక్యూషన్.. మద్యం తాగి వాహనం నడపడం, తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అజాగ్రత్తగా మరణానికి కారణమైనట్లు నిందితుడిపై అభియోగాలు మోపింది. ప్రాసిక్యూషన్ కూడా మద్యం మత్తులో నిందితుడి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొంది.
దిగువ క్రిమినల్ కోర్ట్ మొదట నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని శిక్ష పూర్తయిన తర్వాత అతనిని బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. ఆ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసారు. కానీ అక్కడ కూడా కోర్టు నిందితుడి శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కోర్టు ఆఫ్ కాసేషన్లో అప్పీల్ దాఖలు చేయగా, అక్కడ కూడా నిందితుడికి ఉపశమనం లభించలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..