ఐస్‌లాండ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన జోహెన్స్‌సన్‌

- June 26, 2016 , by Maagulf
ఐస్‌లాండ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన జోహెన్స్‌సన్‌

చరిత్ర అధ్యాపకుడు జోహెన్స్‌సన్‌ ఐస్‌లాండ్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 39.1శాతం ఓట్లతో ఆయన విజయం సాధించినట్లు అక్కడి పబ్లిక్‌ టెలివిజన్‌ ఛానల్‌ ఆర్‌యూవీ వెల్లడించింది. పనామా పత్రాల కలకలంతో ఐస్‌లాండ్‌లో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి.అప్పటి అధ్యక్షుడు సిగ్మండర్‌ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఈ కుంభకోణంలో పలువురు సీనియర్‌ రాజకీయ నాయకులకు హస్తం ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోహెన్స్‌సన్‌ విజయం సాధించారు. రాజకీయ పార్టీలతో అనుబంధం లేకుండా స్వతంత్రంగా పోటీచేసిన మహిళా వ్యాపారవేత్త హల్లా టోమస్‌డాటిర్‌ 27.9శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఓల్ఫర్‌ రాగ్నర్‌ గ్రిమ్సన్‌ స్థానంలో జోహెన్ససన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com