అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం: కెసిఆర్
- December 06, 2024
హైదరాబాద్: సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ శుక్రవారం కేసీఆర్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన అంబేద్కర్ అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని.. అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంబేద్కర్ దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







