కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రిజల్ట్స్, ఆన్సర్ కీ విడుదల..
- December 08, 2024
న్యూ ఢిల్లీ: నేషనల్ లా యూనివర్శిటీల కన్సార్టియం యూజీ, పీజీ కోర్సుల కోసం డిసెంబర్ 7, 2024న కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2025 రిజల్ట్స్ విడుదల చేసింది.ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ క్లాట్ అధికారిక వెబ్‌సైట్ (http://consortiumofnlus.ac.in)ని విజిట్ చేయడం ద్వారా తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
ఆ తరువాత, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో లా కోర్సులలో విద్యార్థుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహిస్తారు.సీఎన్ఎల్‌యూ ఫైనల్ ఆన్సర్ కీని కూడా లాంచ్ చేసింది. ఫైనల్ ఆన్సర్ కీకి వ్యతిరేకంగా ఫిర్యాదులను డిసెంబర్ 8 మధ్యాహ్నం నుంచి తెలియజేయొచ్చు .
“ఇమెయిల్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు, వెబ్‌సైట్‌లోని సపోర్టు టిక్కెట్‌లు లేదా ఫోన్ కాల్స్ పరిగణించబడవు,” అని అధికారిక నోటీసు పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. క్లాట్ 2025 కోసం మొత్తం హాజరు శాతం 96.33 శాతంగా నమోదైంది.
పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 57 శాతం మంది మహిళలు, 43 శాతం మంది పురుషులు, 9 మంది అభ్యర్థులు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. క్లాట్ యూజీ పరీక్ష 2025లో హర్యానాకు చెందిన విద్యార్థి, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి అత్యధిక స్కోర్ (99.997 పర్సంటైల్)ను సాధించారు. క్లాట్ పీజీ 2025 పరీక్షలో ఒడిశాకు చెందిన ఒక విద్యార్థిని 99.993 పర్సంటైల్ స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది.
క్లాట్ రిజల్ట్స్ 2025 : ఎలా చెక్ చేయాలి?
క్లాట్ పరీక్ష అధికారిక వెబ్‌సైట్ (http://consortiumofnlus.ac.in)కి వెళ్లండి.
‘CLAT 2025 Result’ని పేర్కొన్న లింక్ కోసం చూడండి.
మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
మీ క్లాట్ రిజల్ట్స్ 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
క్లాట్ రిజల్ట్స్ 2025ని చెక్ చేయండి.
ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
CLAT 2025 ఫైనల్ ఆన్సర్ కీ : ఫిర్యాదులను ఎలా ఫైల్ చేయాలి?
మీ క్లాట్ అకౌంట్‌కు లాగిన్ చేయండి.
‘Submit Grievance’ బటన్‌ను క్లిక్ చేయండి.
మీ ఫిర్యాదును తెలియజేయండి.
మీ ఫిర్యాదును వివరించండి (గరిష్టంగా 1,000 అక్షరాలు)
సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించండి.
సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
తదుపరి ఉపయోగానికి పేజీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
క్లాట్ 2025 డిసెంబరు 1, 2024న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహిస్తుంది.మార్కింగ్ స్కీమ్ ప్రకారం.. ప్రతి సరైన సమాధానానికి, అభ్యర్థులు ఒక మార్కును పొందుతారు. ప్రతి తప్పుకు 0.25 మార్కులు తొలగిస్తారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి