బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్
- December 09, 2024
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదానీ- రేవంత్ రెడ్డి ఫొటో ఉన్న టీ షర్టులను ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చారు. అసెంబ్లీకి వెళ్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్‌ను కూడా అడ్డుకోవడంతో పోలీసులకు-బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రజా ప్రతినిధులను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదానీ, రేవంత్ ఫొటోలతో ఉన్న టీ షర్టులను ధరించి అసెంబ్లీకి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
తొలిరోజు కీలక బిల్లులు
తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్-2024 ను సభ ముందుంచనున్నారు. పురపాలక సంఘాల ఆర్డినెన్స్ (సవరణ)-2024, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్స్-2024 ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వస్తువుల, సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్స్-2024 బిల్లు, తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక ప్రతి-2022-23ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక (2021-2022), మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్స్-2024 టెబుల్ పై సభాపక్షంలో ఉంచనున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు తెలిపారు. సమావేశాలకు అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరికి వారిగా రెడీ అవుతున్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు వ్యూహాలను రచించుకుంటున్నారు.
అందరి కళ్లు ఆ బిల్లుపైనే
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా నూతన ఆర్వోఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్తగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లు పైనే ఉంది. దీంతోపాటు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తును ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్చే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి