తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే పిటిషన్ వేశారు-రజనీ

- July 08, 2015 , by Maagulf
తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే పిటిషన్ వేశారు-రజనీ

తన అల్లుడి తండ్రి తీసుకున్న 65 లక్షల రూపాయల అప్పుకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేశారు. తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఈ కేసులో తనపై పిటిషన్ వేశారని ఆయన తెలిపారు. 2012లో రజనీకాంత్ అల్లుడి తండ్రి కస్తూరి రాజా ఓ ఫైనాన్షియర్ దగ్గర నుంచి 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తాను అప్పు తీర్చకపోతే రజనీకాంత్ తీరుస్తాడని ఫైనాన్షియర్‌ను నమ్మించాడు. కస్తూరి రాజా అప్పు తీర్చకపోవడంతో ఫైనాన్షియర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయమూర్తి రవిచంద్రబాబు ఈ నెల 22న కస్తూరి రాజాకు, రజనీకాంత్‌కు నోటీసులు జారీ చేశారు. కోర్టుకు హాజరైన రజనీకాంత్ తన పేరు వాడుకుని డబ్బులు తీసుకుంటే తానెలా బాధ్యుడవునతానని వాదించారు. తాను ఎవరినుంచీ అప్పు తీసుకోలేదని, ఎవరికీ గ్యారంటీ కూడా ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు. తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే తనను ఈ కేసులోకి బలవంతంగా లాగారని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com