తెలంగాణలో రాష్ట్రపతి ఐదురోజుల పర్యటన
- December 10, 2024
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఇవాళ సచివాలయంలో సమీక్షించారు.
పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము ఈ నెల 17 నుంచి (21 వరకు) ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారని… ఈ మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆయన చేస్తారని సిఎస్ తెలిపారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తగురీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







