దోహా మెట్రోలో ‘సౌఖ్ అల్ రైల్’.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక ఈవెంట్లు..!!

- December 11, 2024 , by Maagulf
దోహా మెట్రోలో ‘సౌఖ్ అల్ రైల్’.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక ఈవెంట్లు..!!

దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) నిర్వహించిన “సౌక్ అల్ రైల్” ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. డిసెంబర్  14 వరకు జరిగే కార్యక్రమాలు దోహా మెట్రోలోని మషీరెబ్ స్టేషన్‌లో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఖతార్ రైల్ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఖతార్ రైల్‌లోని కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ అబ్దుల్లా అలీ అల్ మవ్లావి మాట్లాడుతూ.. “'సౌక్ అల్ రైల్' ఈవెంట్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.రోజువారీ కార్యకలాపాలతో విస్తృతంగా ప్రజల భాగస్వామ్యం, సానుకూల స్పందన పట్ల తాము సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.  “ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగమైన ఈ ఈవెంట్, ఈ జాతీయ సందర్భంగా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, సభ్యుల మధ్య ఉండే స్ఫూర్తిని పెంపొందించడానికి మా బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకమైన సాంస్కృతిక,  వినోద కార్యక్రమాలను ఆస్వాదించడానికి 'సౌక్ అల్ రైల్' వద్ద మాతో చేరాలని మేము ప్రతి ఒక్కరినీ, నివాసితులు మరియు సందర్శకులను ఆహ్వానిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు. 

దోహా మెట్రో మూడు లైన్ల కూడలి అయిన మషీరెబ్ స్టేషన్ సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. "సౌక్ అల్ రైల్" రోజువారీ షెడ్యూల్ ఆదివారం నుండి గురువారం వరకు సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు,  శుక్రవారం, శనివారం సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఖతారీ అర్ధ స్వోర్డ్ డ్యాన్స్, సాంప్రదాయ ఖతారీ డ్రెస్ కార్నర్, ఫేస్ పెయింటింగ్, ఫాల్కన్రీ, నేషనల్ డే క్విజ్,  స్టోరీ టెల్లింగ్ సర్కిల్ వంటి ఇంటరాక్టివ్ కుటుంబ-స్నేహపూర్వక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com