హాస్పిటాలిటీ రంగంలో 22% ప్రభుత్వ రుసుములు తగ్గింపు..!!
- December 11, 2024
బురైదా: సౌదీ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం హాస్పిటాలిటీ రంగంలో ప్రభుత్వ రుసుములను 22 శాతం తగ్గించేందుకు పని చేస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. అల్-ఖాసిమ్ ప్రాంతంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలను అల్-ఖతీబ్ వెల్లడించారు.టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ ఎనేబుల్స్ ప్రోగ్రాం అనేది పర్యాటక రంగంలో పెట్టుబడిదారులకు ప్రోత్సహించడానికి రూపొందించబడిన ప్రత్యేక కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.
అల్-ఖతీబ్ అల్-ఖాసిమ్ రాజ్యంలో అత్యంత ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి అని, దాని సహజ వైవిధ్యం, చారిత్రక వారసత్వ చరిత్ర కారణంగా పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పించడం మంత్రిత్వ శాఖ చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







