ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, కెనడియన్ పీఎం సమీక్ష..!!

- December 11, 2024 , by Maagulf
ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, కెనడియన్ పీఎం సమీక్ష..!!

రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నుండి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం తెలిపింది. ఫోన్ కాల్ సందర్భంగా.. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఈ ప్రాంతంలో శాంతి – భద్రతలు, స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని నాయకులు నిర్ణయించారు. గాజా, ఆక్రమిత పాలస్తీనా,సిరియాలో నెలకొన్న పరిణామాలు, పరస్పర ఆసక్తి ఉన్న అనేక ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ రంగాలలో వాటిని మెరుగుపరచడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com