దుబాయ్ లో 19 కొత్త రోడ్లు.. 40% తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!

- December 12, 2024 , by Maagulf
దుబాయ్ లో 19 కొత్త రోడ్లు.. 40% తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!

దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఎమిరేట్‌లోని 19 నివాస ప్రాంతాలలో రోడ్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. RTA ప్రకారం.. కొత్త రోడ్లు నివాస ప్రాంతాలకు వాహనాల ప్రవేశాన్ని, నిష్క్రమణను క్రమబద్ధీకరిస్తాయి. అదే సమయంలో ప్రయాణ సమయాన్ని 40 శాతం వరకు తగ్గిస్తాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ నివాస ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డెవలప్ చేయడం, రోడ్డు పక్కన పార్కింగ్, ఫుట్ పాత్ నిర్మాణం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు.

మొత్తం 11.5 కి.మీ పొడవును కవర్ చేసే ఈ ప్రాజెక్ట్.. దుబాయ్ పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ అవసరాలను తీర్చడంతోపాటు రోడ్డు వినియోగదారులకు సున్నితమైన,  సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 రెండో త్రైమాసికంలో రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు.  

ప్రాజెక్ట్‌లో ఉన్న 19 నివాస ప్రాంతాలు:

అల్ ఖవానీజ్ 1, అల్ బర్షా సౌత్ 1, నాద్ షమ్మా, జుమేరా 1, జబీల్ 1, అల్ రషీదియా, ముహైస్నా 1, అల్ బర్షా 1, అల్ హుదైబా, అల్ క్యూజ్ 1, అల్ క్వోజ్ 3, అల్ ఖుసైస్ 2, అల్ సత్వా, అల్ త్వార్ 1, మిర్దిఫ్, ఉమ్ అల్ రామూల్, ఉమ్ సుఖీమ్ 1, అల్ మిజార్ 1, అల్ మిజార్ 2.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com