సూర్య, త్రివిక్రమ్ కాంబినేష్ కి బ్రేక్...

- June 27, 2016 , by Maagulf
సూర్య, త్రివిక్రమ్ కాంబినేష్ కి  బ్రేక్...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అఆ మూవీ టాలీవుడ్ లో మంచి హిట్ ని సాధించింది. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ ఏ మూవీకి డైరెక్టర్ గా చేయనున్నారు అనే విషయంపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన విషయంపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
అయితే త్రివిక్రమ్ ప్లానింగ్ ప్రకారం, నితిన్ నటించిన అఆ మూవీ తరువాత వెంటనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి పనిచేయాల్సి ఉంది. అఆ మూవీ సమయంలోనే త్రివిక్రమ్, సూర్యని కలిసి కథని చెప్పటం.తరువాత ఆ కథని డెవలప్ చేయటం వంటివి జరిగాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ పై సూర్యకి మంచి అభిప్రాయం ఉండటమే కాకుండా, సూర్య సైతం డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించేందుకు త్రివిక్రమ్ సరైన డైరెక్టర్ అని భావించారు.కానీ ప్రస్తుతం ఈ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని లేటెస్ట్ కాంబినేషన్స్ ని చూస్తుంటే త్రివిక్రమ్, సూర్యా కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మార్పులను చూస్తుంటే, సూర్య డైరెక్టర్ త్రివిక్రమ్ తో కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ తో పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటి వివరాలను చూస్తే, 'అట్టకత్తి', 'మద్రాస్' సినిమాలతో దర్శకుడు పా రంజిత్ మంచి పాపులర్ అయ్యారు.ఇప్పుడు రజనీకాంత్‌ తో రంజిత్ తెరకెక్కించిన 'కబాలి' సినిమా విపరీతమైన క్రేజ్ ని అందుకుంటుంది. ఈ మూవీ తరువాత రంజిత్, హీరో సూర్య మూవీతో కలిపి పనిచేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వస్తుందని, ఇందులో సూర్య నటించనున్నారని అంటున్నారు. దీంతో సూర్య, త్రివిక్రమ్ కాంబినేష్ కి ప్రస్తుతం బ్రేక్ పడినట్టే అని అంటున్నారు. ఈ న్యూస్ త్రివిక్రమ్ కి కొంత షాకింగ్ అని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com