అలెర్ట్..అజ్మాన్ ట్రాఫిక్ జరిమానాల పై 50% తగ్గింపు..!!

- December 15, 2024 , by Maagulf
అలెర్ట్..అజ్మాన్ ట్రాఫిక్ జరిమానాల పై 50% తగ్గింపు..!!

అజ్మాన్: ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపును అజ్మాన్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు. డిసెంబర్ 15తో షెడ్యూల్ గడువు ముగియనుంది.  అయితే, ఇది "తీవ్రమైన ఉల్లంఘనలను" కవర్ చేయదని అథారిటీ తెలిపింది. తేలికైన లేదా భారీ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ఓవర్‌టేకింగ్ నిషేధించబడిన ప్రదేశంలో ట్రక్కు డ్రైవర్లు ఓవర్‌టేక్ చేయడం, గరిష్ట వేగ పరిమితిని 80కిమీ కంటే ఎక్కువ దాటడం,ముందస్తు అనుమతి లేకుండా వాహనంలో మార్పులు చేయడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ వర్తించదు.  వాహన యజమానులందరూ ఈ నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకోవాలని , జరిమానాలను చెల్లించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.సేవా కేంద్రాలు, అంతర్గత మంత్రిత్వ శాఖ యాప్, అజ్మాన్ పోలీస్ యాప్ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది.   డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ మాట్లాడవద్దని, సీటు బెల్టులు ధరించాలని సూచించింది. లేదంటే ఫెడరల్ చట్టం ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్‌పై 400 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com