ఒమన్ చేరుకున్న బెలారస్ అధ్యక్షుడు..!!
- December 15, 2024
మస్కట్ : రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఒమన్ సుల్తానేట్‌లో అధికారిక పర్యటన నిమిత్తం మస్కట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో సమావేశమవుతారు. రాయల్ ఎయిర్‌పోర్ట్‌లో బెలారసియన్ ప్రెసిడెంట్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ స్వాగతం పలికారు. ఈ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో బెలారసియన్ అధ్యక్షుడితో పాటు ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు విక్టర్ లుకాషెంకో, విదేశాంగ మంత్రి మాగ్జిమ్ రైజెంకోవ్, పరిశ్రమల మంత్రి అలెగ్జాండర్ ఎఫిమోవ్, వ్యవసాయం మరియు ఆహార మంత్రి అనటోలీ లినెవిచ్, ఒమన్‌లోని బెలారస్ యొక్క నాన్-రెసిడెంట్ రాయబారి సెర్గీ టెరెన్టీవ్ ఉన్నారు. అల్ ఆలం ప్యాలెస్‌లో హిస్ మెజెస్టి సుల్తాన్, బెలారసియన్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఒమన్ - బెలారస్ మధ్య అధికారిక చర్చలు జరుగుతాయి. వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







