రమదాన్ స్పెషల్: పాయా
- July 08, 2015
కావలిసిన పదార్దాలు
మేక కాళ్లు - 4
కారం - 3 స్పూన్లు
ఉల్లిపాయలు - 2
పుదీనా - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
నూనె - 6 స్పూన్లు
లవంగాలు - రెండు
నల్లయాలకులు - రెండు
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
ఉప్పు - సరిపడినంత
పసుపు - ఒక స్పూను
పచ్చి కొబ్బరి తురుము - 10 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 6 స్పూన్లు
గసగసాలు - 10 స్పూన్లు
నిమ్మకాయ - ఒకటి
పొట్లి మసాలా - 5 చెంచాలు
పొట్లి మసాలా అంటే పలావు ఆకులు, రనియాలు, వట్టివేరు వేళ్లు, గంధం పొడి, ఎండుగులాబీ రేకులు, నల్లయాలకులు, దాల్చిన చెక్క, పత్తర్ కాపూల్, అనాస పువ్వు, కస్తూరి మెంతి లాంటివన్నీ కలిపి మిక్సీ వేస్తే దాన్ని పొట్లి మసాలా అంటారు. దీన్ని రంజాన్ వంటకాల్లో ముస్లింలు ఎక్కువగా వాడతారు. ఇది మార్కెట్లో నేరుగా దొరుకుతుంది.
తయారీ విధానం
ముందుగా మేక కాళ్లను పసుపు పట్టించి బాగా కడగాలి. గసగసాలు, కొబ్బరి కలిపి ముద్దలా చెయ్యాలి. ప్రెషర్ కుక్కర్లో మేకకాళ్లు వేసి సగం కారం, సగం అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, పుదీనా తురుము, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి అరగంటసేపు ఉడికించాలి.బాణలిలో నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లి ముక్కలు, పసుపు, మిగిలిన కారం, దనియాల పొడి వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి,గసగసాల ముద్ద వేసి ఓ నిముషం వేయించాలి. తరువాత కుక్కర్లో ఉడికించిన మేక కాళ్లని నీళ్లతో సహా వేసి ఈ మిశ్రమంలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ఇప్పుడు పొట్లి మసాలాను ఇక పల్చని బట్టలో మూటలా కట్టి అందులో వేసి సుమారు ఐదు నిముషాలు ఉడికించి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసినాక తీసేయాలి. ఇంతే పాయా రెడీ వేడివేడిగా తింటే దీని టేస్టే టేస్టు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







