ధనుర్వాతానికి టీకా తప్పనిసరి
- July 08, 2015
చాలామంది తుప్పు పట్టిన మేకులు, ఇనుప ముక్కలు గుచ్చుకోవడం వల్లనే సెప్టిక్ అయ్యి, తద్వారా ధనుర్వాతంలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కానీ నిజానికి ధనుర్వాతం కలిగించే బాక్టీరియా సిద్ధబీజాలు మట్టి, దుమ్ము, ధూళి ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. కీటకాలు, కుక్కకాట్లు లేదా ఇతర జంతువుల్లాంటివి కరవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణుల ద్వారా వెల్లడైన విషయం. శరీరం మీద ఎక్కడైనా గాయంలాంటివి అయినపుడు ఈ వ్యాధిని కల్గించే సూక్ష్మజీవులు చర్మం ద్వారా రక్తంలోనికి ప్రవేశించి, తద్వారా వెన్నుపాము, మెదడుకు వ్యాపిస్తాయి. ఇలా చూస్తుండగానే వ్యాధి కొన్ని రోజుల్లోనే తీవ్ర రూపం దాల్చుతుంది. మెడ బిగుసుకుపోవడం, మింగడానికి కష్టమవడం, కడుపు బల్లలాగా మారిపోవడంలాంటివి ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ వ్యాధి ఒక్కసారి సంక్రమించినాక నియంత్రించడం అసాధ్యం. అందుకే ప్రపంచ ఆరోగ్య శాఖ వారు ఈ వ్యాధికి సంబంధించిన టీకాలను అందుబాటులోకి తీసుకురావడంతో దీన్ని కొంతవరకూ నియంత్రించడం జరుగుతుంది. అయితే ప్రతీ పదేళ్లకోసారి ఖచ్చితంగా ఈ టీకా ను వేయించుకోవాలి. కొన్ని సమయాల్లో పెద్ద పెద్ద గాయాలే కాకుండా, పెంపుడు జంతువులు కరవడం, కొన్ని రకాల కీటకాల కాట్లు వంటి వాటి ద్వారా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందుకే తప్పనిసరిగా ఈ టీకాని తీసుకోవడం మేలని వైద్యుల సలహా.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







