'ఘాటి' ఏప్రిల్ 18, 2025న వరల్డ్ వైడ్ రిలీజ్
- December 15, 2024క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్-ఇండియా మూవీ.యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వేదం బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అనుష్క,క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఘాటి, ఇది UV క్రియేషన్స్‌తో కలిసి అనుష్క నాల్గవ సినిమా.
గ్లింప్స్ తో క్యురియాసిటీని క్రియేట్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని అనౌన్స్ చేశారు- ఏప్రిల్ 18న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. సమ్మర్ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం. ఈ అనౌన్స్మెంట్ క్రిష్, అనుష్క, ఫిల్మ్ మేకర్స్ తో కూడిన ఫన్ వీడియో ద్వారా వచ్చింది. పాన్-ఇండియా మూవీ కోసం సమ్మర్ రిలీజ్ సరైన సీజన్. విడుదల తేదీ పోస్టర్లో అనుష్క చీర కట్టుకుని టెర్రిఫిక్ లుక్‌లో కనిపించింది. చేతిలో తుపాకీతో కొండపై నిలబడి, ఆమె శరీరం అంతటా చెల్లాచెదురుగా ఉన్న రక్తపు గుర్తులతో, ఇంటెన్స్ లుక్ ని ప్రజెంట్ చేస్తోంది.
విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌త ఘాటీ అద్భుతమైన కథనాన్ని, మానవత్వం, మనుగడ , ముక్తికి హామీ ఇస్తుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విసెరల్, యాక్షన్-ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: అనుష్క శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
ప్రెజెంట్స్: UV క్రియేషన్స్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
కథ: చంటకింది శ్రీనివాసరావు
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







